🙏 ఆర్జిత బ్రహ్మోత్సవం 🙏
💫 ఉభయదేవేరులతో కూడిన మలయప్పస్వామికి సంక్షిప్తంగా వాహనసేవలను నిర్వహించడం 'ఆర్జిత బ్రహ్మోత్సవం' గా పిలువబడుతుంది. శ్రీవారి ఉత్సవమూర్తులను బంగారు తిరుచ్చి మీద ఆలయం వెలుపల ఉన్న వైభవోత్సవ మండపానికి (ఈ మండపాన్ని రాంబగీచా ఆతిథి గృహం నుంచి శ్రీవారి మందిరానికి వెళ్ళేటప్పుడు, గేటు దాటగానే కుడి ప్రక్కన చూడవచ్చు).
💫 అక్కడ శ్రీవారికి ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా ముఖ్యమైన వాహనాలైన గరుడవాహనం, హనుమంతవాహనం, పెద్దశేషవాహనంలో వేంచేపుచేసి హారతి ఇస్తారు.
💫 ఈ సేవలో పాల్గనటం ద్వారా భక్తులకు శ్రీవారి అనుగ్రహం ద్వారా బుద్ధిబలం, యశస్సు, ధైర్యం, ఆరోగ్యం, ధనలాభం, సంతానప్రాప్తి కలుగుతాయి.
💫 ప్రతిరోజూ మధ్యాహ్నం 2-3 గం. ల మధ్య ఈ సేవ జరుగుతుంది.
No comments :