🙏 డోలోత్సవం 🙏
💫 నిత్యకళ్యాణోత్సవం పూర్తయిన తరువాత శ్రీదేవీ-భూదేవి సమేత శ్రీమలయప్పస్వామిని ధ్వజస్తంభానికి ఎడమవైపు (మనం మందిరంలోకి వెళ్ళేటప్పుడు కుడి వైపు) ఉన్న ఆయినామహల్ (అద్దాలమంటపం) లోకి తీసుకుని వెళతారు. ఈ మండపం మధ్యలో ఉన్న డోల (ఉయ్యాల) లో, స్వామివారికి ఉభయదేవేరుల సమేతంగా డోలోత్సవం నిర్వహిస్తారు. భక్తులను స్వామివారికి ఎదురుగా కూర్చుండబెట్టి, వేదపఠనం, వేదాశీర్వాదం జరుపుతారు. ఈ మండపంలో బిగించివున్న అద్దాలలో స్వామి అన్నివైపులా కనిపిస్తూ, భక్తులకు దివ్యదర్శనాన్ని అనుగ్రహిస్తూ, తన సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తారు. తదుపరి, శ్రీవారికి పంచకజ్జాయం అనే ప్రసాదాన్ని నివేదన చేసి, హరతిస్తారు.
👉 (శ్రీవారికి సమర్పించే అనేక రకాలైన ప్రసాదాల గురించి మరొక ప్రకరణంలో విస్తారంగా తెలుసుకుందాం).
💫 ప్రతిరోజూ మధ్యాహ్నం 1-2 గం. ల మధ్య ఈ డోలోత్సవం జరుగుతుంది.
No comments :