💫 తోమాలసేవ అంటే?
💫 తోమాలసేవ - భోగశ్రీనివాసునికి జరిగే అభిషేకం.
💫 శ్రీనివివాసుని దివ్యమంగళమూర్తికి అనేక పుష్పమాలలతో, తులసిమాలలతో, అనునిత్యం చేసే సేవాకైంకర్యమే "తోమాలసేవ". ఈ సేవకు "తోమాలసేవ" అనే పేరు రావడం వెనుక అనేక కథనాలున్నాయి.
💐తమిళంలో 'తోడుత్తమాలై' అంటే నారతో కట్టిన మాల అని అర్థం. కాలక్రమంలో అదే 'తోమాల' గా మారి ఉండవచ్చు.
💐'తోల్' అంటే భుజం అని అర్థం. భుజం నుంచి వ్రేలాడే మాలలు గనుక 'తోమాలలు' అని అంటారు.
💐 'తోమాల' అంటే చేతితో కట్టిన పూలదండ అని మరియొక అర్థం కూడా ఉంది.
💐 అంతే కాకుండా, తోమాల అంటే తోటలో నుండి తెచ్చిన పూమాలలు లేదా తులసిమాలలు అనే అర్థం కూడా ఉంది.
💫 దాదాపుగా పైన చెప్పిన అర్థాలన్నీ ఈ సేవకు వర్తిస్తాయి.
💫 ముందురోజు రాత్రే ఆయా కాలాల్లో లభించే అనేక రకాల, రంగురంగుల, పరిమళ పుష్పాలతో తయారు చేయబడిన పుష్పమాలికలను, విమాన ప్రదక్షిణం లోని యోగానరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న శీతల పుష్పఅర లో సిద్ధం చేస్తారు.
No comments :