🙏 మాలలకు పేర్లు 💐
💫 ఆపాదమస్తకం అలంకరింపబడే ఈ పుష్పమాలలకు కొన్ని స్థిరమైన పేర్లు ఉండటం విశేషం -
⛩️ శ్రీవారి పాదాలపై అలంకరించే ఒక్కక్క మూర గల రెండు పుష్పమాలలను - తిరువడి దండలు అంటారు.
⛩️ శ్రీవారి కిరీటం మీదుగా రెండు భుజాలవరకు అలంకరింపబడే 8 మూరల పుష్పమాలను - శిఖామణి అంటారు.
⛩️ శ్రీవారి భుజాలనుండి ఇరువైపులా పాదాలవరకు వ్రేలాడునట్లుగా అలంకరించే పొడవాటి మాలను - సాలగ్రామమాల అంటారు.
⛩️ శ్రీవారి మెడలో రెండు వరుసలుగా భుజాలమీదికి అలంకరించబడే మూడున్నర మూరల పుష్పహారాన్ని - కంఠసరి అంటారు.
⛩️ శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవిలకు ఒకటిన్నర మూరల పొడవుండే రెండు పుష్పమాలికలను - వక్షస్థలమాలలు లేదా వక్షఃస్థల తాయార్ల సరాలు అంటారు.
⛩️ ఒక్కొక్కటి ఒక్కొక్క మూర ఉన్న రెండు దండలను శంఖుచక్రాలకు అలంకరిస్తారు. వీటిని - శంఖుమాల, చక్రమాల అంటారు.
⛩️ శ్రీవారి నందకఖడ్గానికి అలంకరించే రెండు మూరల పుష్పమాలికను - కఠారిసరం అంటారు.
⛩️ రెండు మోచేతుల క్రింద నుండి పాదాలవరకు వ్రేలాడదీసే రెండు పుష్పమాలలను - తావళములు అంటారు. వీటిలో ఒకటి 40 అంగుళాలు మరియొకటి 50 అంగుళాల పొడవు ఉంటాయి. వీటిని శ్రీవారికి ఇంగ్లీషు అక్షరం U ఆకారంలో ధరింపజేస్తారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 ఉత్సవమూర్తులకు పుష్పమాలాలంకరణ 💐
💫 శ్రీవైష్ణవస్వాములు గోదాదేవి కీర్తించిన తిరుప్పావై లోని "తిరుప్పళ్ళియెళుచ్చి," "తిరుప్పళ్ళాండు" మొదలైన పాశురాలు శ్రావ్యంగా గానం చేస్తుండగా, అర్చకస్వాములు శ్రీదేవీ-భూదేవి సమేతుడైన మలయప్పస్వామికీ, ఉగ్రశ్రీనివాసమూర్తికీ, కొలుపు శ్రీనివాసమూర్తికీ, సీతాలక్ష్మణ సమేతుడైన కోదండరామస్వామికీ, రుక్మిణీ సమేతుడైన శ్రీకృష్ణునికీ, చక్రత్తాళ్వార్ కు మరియు సాలగ్రామాలకు పుష్పమాలలు అలంకరిస్తారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 ధూప దీప హారతులు 🙏
💫 పుష్పమాలాలంకరణ పూర్తయిన తరువాత వేదపండితులు మంత్రపుష్పాన్ని సమర్పిస్తారు. ఆ తరువాత స్వామివారికి ధూప, దీప, నక్షత్ర హారతులు, చివరగా కర్పూరహారతి సమర్పిస్తారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 ముప్పూటలా తోమాలసేవ 🙏
💫 ఈ సేవ సుమారు అరగంటకు పైగా జరుగుతుంది.
💫 నిత్యార్చనలో భాగంగా జరిగే ఈ తోమాలసేవ, ఉదయం విస్తారంగా, మధ్యాహ్నం క్లుప్తంగా మరల సాయంత్రం విస్తారంగానూ, ముప్పూటలా జరుగుతుంది. ఉదయం జరిగే తోమాలసేవ మాత్రమే అర్జితసేవ. అప్పుడు మాత్రమే ఈ సేవను భక్తులు దర్శించుకోగలరు. మధ్యాహ్నం, రాత్రి జరిగే తోమాలసేవలు ఏకాంతంగా జరుగుతాయి.
⛩️ ఈ మాలలన్నింటినీ మూర (18 అంగుళాలు), బార (36 అంగుళాలు) కొలమానంతో వ్యవహరిస్తారు.
🙏 అంతటితో తోమాలసేవ ముగిస్తుంది. 🙏
No comments :