#పూజ :-పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది.
#సంపూర్ణఫలాన్నిచ్చేది.
#అర్చన:- అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.*
#జపం:- అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం. ఇది జివుణ్ణి , దేవుణ్ణి చేస్తుంది.*
#స్తోత్రం:- నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.*
#ధ్యానం:- ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది.*
#దీక్ష:- దివ్యభావాలను కల్గించేది. పాపాలను కడిగివేసేది. సంసార బంధాలనుండి విముక్తిని కల్గించేది దీక్ష.*
#అభిషేకం :- అభిషేకం చేస్తే , చేయిస్తే సకల శుభాలు కలుగుతాయి. అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరా తత్వాన్ని అందిస్తుంది.*
#మంత్రం:- తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం. అఖండ శక్తి నీ ఇస్తుంది.*
#ఆసనం:- ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.*
#తర్పణం:- పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.
#గంధం:- గంధంలో సర్వ దేవత కొలువై ఉన్నారు.*
*”మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వుతల్లీ”అని దేవతలంతో అమ్మవారిని కోరారు. అప్పుడు అమ్మవారు “మీరు గంధంలో కొలువై ఉందురుగాక” అని వరం ఇచ్చారు. అప్పటినుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది.*
#అక్షతలు:- కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి. పసుపు, కుంకుమ , నూకలు (విరిగిన బియ్యం) లేని మంచి బియ్యం కలిపి చేయాలి.*
#పుష్పం:- పుణ్యాన్ని వృద్ధిచేసి, పాపాన్ని పోగొట్టేది. మంచి బుద్ధిని ఇచ్చేది.*
#అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి.*
#మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది.*
#(ఈమధ్య పుష్పాలను చించి రేకలను విడదీసి వాడుతున్నారు. అలా చేయవద్దు. కాగా తొడిమలను తప్పకుండా తుంచివేశాకే పుష్పాలను పూజలో వినియోగించాలి.*
#ధూపం:- చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది. ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది. ప్రేత , పిశాచాలు పారిపోతాయి.*
#దీపం:- సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది. ఈ దీపం జ్ఞానానికి సంకేతం. పూజగదిలో దీపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న దుష్ట ప్రభావం దగ్గరికి రాదు. “అగ్ని” శివుడి కుమారుడైన కుమారస్వామికి ప్రతీక.*
#నైవేద్యం:- మధుర పదార్థాలను నివేదన చేయుటయే నైవేద్యం.
#ప్రసాదం:-భగవంతుడికి నివేదించిన నైవేద్యమే ప్రసాదం.* *ప్రకాశానందాల నిచ్చేది. సామరస్యాన్ని కల్గించేది. పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం. ప్రసాదం భగవదనుగ్రహ సంకేతం. అత్యంత పవిత్రమైన పదార్థం.*
#ఏ రూపంలోని ప్రసాదాన్నైనా “ప్రసాదం” అని మాత్రమే వ్యవహరించాలి.ఇటీవల అందరూ ‘పులిహోర’, ‘కొబ్బరి’ అని అనడానికి అలవాటు పడ్డారు. అలా అనకూడదు. “పులిహోర ప్రసాదం”, “కొబ్బరి ప్రసాదం” అనవచ్చు.*
#వందనం:- అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం. చేతులు జోడించి కూడా వందనం చేయవచ్చు. సాష్టాంగ ప్రణామం అంటే వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకుతాకించి చేసే వందనం. ఈ సాష్టాంగ ప్రణామం పురుషులు మాత్రమే చేయాలి. ఇది స్త్రీలు చేయరాదు. స్త్రీలు మోకాళ్ళ పై భగవంతుడికి వందనం చేయొచ్చు.*
#ఉద్వాసన:- ఆవరణ దేవతలను పూజించి, పూజను ముగించడాన్ని ఉద్వాసనమని అంటారు. చివర్లో ప్రార్థన , దోష క్షమాపణ చెప్పి తీర్థ , ప్రసాదాలు స్వీకరించి స్వస్తి చెప్పి ఉద్వాసన చేయవలసి ఉంటుంది🙏
#సర్వోజనా సుఖినోభావంత్
No comments :