🌿🌼🙏#ధన #త్రయోదశి - #కుబేర #వృత్తాంతం 🙏🌼🌿
#పూర్తిగా_చదవండి
#అందరూ_దర్శించేందుకు_దయచేసి_షేర్_చేయండి
🌿🌼🙏కుబేరుడు హిందూపురాణాల ప్రకారం యక్షులకు రాజు. సిరిసంపదలకు అధిపతి. ధనపతి. ఉత్తర దిక్కుకు అధిపతి. ఈయన విశ్రవసుని కుమారుడు. నివసించే నగరం అలకాపురి🙏🌼🌿
🌿🌼🙏కృతయుగంలో బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు అనే బ్రహ్మర్షి, మేరుపర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ, వేదాధ్యయనం గావిస్తూ, నిష్టతో తపస్సు చేస్తూ వుండేవాడు. అందమైన ప్రకృతి సంపదతో విలసిల్లే ఆ ప్రదేశంలో, విహారం కోసం దేవకన్యలు, ఋషికన్యలు, తదితరులు విహారం కోసం వచ్చేవారు. పులస్త్యుడికి వీరివలన తరచూ తపోభంగం కలుగుతుండేది. అందువలన వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి, వారిని ఆ ప్రదేశానికి రావద్దనీ, ఒకవేళ ఎవరైనా వచ్చి, తనని చూసిన యెడల గర్భం దాలుస్తారని శాపం విధిస్తాడు🙏🌼🌿
🌿🌼🙏ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కుమార్తె, ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశించి, పులస్త్యుడిని చూడటం తటస్థించింది. వెంటనే ఆమె గర్భం దాల్చింది. ఆమె భయంతో, ఆశ్చర్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి, తలవాల్చి నిలుచుంది. ఆయన తన దివ్యదృష్టితో జరిగింది గమనించి, ఆమెను పులస్త్యుని వద్దకు తీసుకువెళ్ళి, ఆమెను భార్యగా స్వీకరించాల్సిందిగా కోరాడు. అందుకు ఆయన అంగీకరించాడు. వీరిద్దరికీ పుట్టిన శిశువే విశ్రవసుడు. విశ్రవసుడి కుమారుడు కుబేరుడు🙏🌼🌿
🌿🌼🙏కుబేరుడు ధనాధిదేవత. శ్రీ వేంకటేశ్వరుడు వివాహం నిమిత్తము కుబేరుని దగ్గర ఎక్కువమొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకున్నాడనీ, ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని, మన విశ్వాసం🙏🌼🌿
🌿🌼🙏కుబేరుడు అనగా అవలక్షణములతో కూడిన శరీరము కలవాడు (బేరము అంటే శరీరము) అని అర్థము. పేరుకి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా (మరగుజ్జులా), పెద్ద కుండ వంటి పొట్టతో, మూడు కాళ్ళు, ఒకే కన్ను, ఎనిమిది దంతాలతో వుంటాడని, మన పురాణాలలో చెప్పబడింది🙏🌼🌿
🌿🌼🙏శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం, కుబేరుడు రత్నగర్భుడు. బంగారు వస్త్రాలతో, మణులు పొదగబడిన బంగారు ఆభరణాలతో వుంటాడు.. ఈయన ముఖము ఎడమవైపుకి వాలినట్టు వుంటుందనీ, మీసం, గడ్డం, కలిగి వుంటాడనీ, దంతాలు బయటకి వచ్చి (వినాయకుని దంతాల వలె) ఉంటాయనీ తెలుస్తున్నది. . అదే విధముగా, శ్రీ శివ, మత్స్య, స్కాంద పురాణాల ప్రకారం, కుబేరుని శరీరం మాత్రం వినాయకుని పోలి ఉంటుందని చెప్పబడింది🙏🌼🌿
🌿🌼🙏కుబేరుని పూర్వజన్మల గురించి శ్రీ శివ పురాణంలో, సూత మహర్షి శౌనకాది మునులకి చెప్పిన ప్రకారం, పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు – సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేద, వేదాంగాలు, శాస్త్ర, పురాణాలు అన్నిటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు, రాజాదరణ పొంది రాజగురువుగా నియమింపబడ్డాడు. వీరి ఏకైక సంతానం గుణనిధి. అతను చెడు సావాసాల వలన జూదానికి బానిసయ్యి, ఆ జూద క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. తల్లయిన సోమిదమ్మకి ఇవన్నీ తెలిసినా, గారాబంతో మందలించకపోగా, భర్తకు ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అన్న భయంతో, మౌనం వహించేది🙏🌼🌿
🌿🌼🙏యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్య కలాపాలలో నిమగ్నమై కొడుకుని పట్టించుకునే వాడు కాదు. ఎప్పుడయినా కొడుకు గురించి భార్యను వాకబు చేస్తే, ఆవిడ పుత్ర ప్రేమతో, చదువుకోడానికి గురువుగారి వద్దకు వెళ్ళాడనో, గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్య పెట్టేది. దానితో గుణనిధికి అడ్డు, అదుపు లేక, ఇంటిలో నగలన్నీ దొంగిలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. అలా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరం కూడా జూదంలో పెట్టి ఓడిపోయాడు🙏🌼🌿
🌿🌼🙏ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంట పడటం, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతనిని నిలదీయటం, అతను జూదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పటంతో యజ్ఞదత్తుని నోటమాట రాలేదు. ఆ రోజు దాకా కొడుకు ఏమి చేస్తున్నదీ తనకు తెలియని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతూ, భార్యా బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్లి, కొడుకు చెడు సావాసాలకు లోనయిన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలించాడు🙏🌼🌿
🌿🌼🙏ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేక పోయాడు. తన మిత్రులెవరూ కూడా తనకి తల దాచుకోవటానికి సహకరించలేదు. ప్రక్కనే ఉన్న గౌతమీనది దాటి ప్రక్క ఊరు చేరుకున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి, తమ శక్తి కొలదీ జాగారాలు చేసి, మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు🙏🌼🌿
🌿🌼🙏భక్తులంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక, ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తీసుకుని తిందామని గర్భ గుడిలోనికి వెళ్ళాడు. చీకటిలో ఏమీ కనిపించక, తన పైవస్త్రాన్ని చించి వత్తిగా చేసి, అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటకి నడుస్తుండగా, గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి, నందీశ్వరుని మీద పడి, తల పగిలి చనిపోతాడు🙏🌼🌿
🌿🌼🙏ఊరి నుండి పారిపోతూ పవిత్రమయిన గౌతమీ స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం, ఇవన్నీ అనుకోకుండా చేసినా శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించటం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. ఆ తరువాత జన్మలో, గుణనిధియే, విశ్రవునికీ, , భరద్వాజ మహర్షి కుమార్తె అయిన దేవవర్ణికీ పుట్టినవాడు వైశ్రవణుడు. ఈ వైశ్రవణుడే కుబేరుడు🙏🌼🌿
🌿🌼🙏కుబేరుడు చిన్నతనం నుండి శివ భక్తి తత్పరుడు. కైలాస ప్రాప్తి పొందిన గుణనిధే ఈ జన్మలో వైశ్రవణుడిగా (కుబేరునిగా) పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు, తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయటం మొదలు పెట్టాడు. కొన్ని ఏళ్ళు కేవలం ద్రవ పదార్ధాలను సేవించి, తరువాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి, అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా వెయ్యి సంవత్సరాల పాటు కుబేరుడు చేసిన తపస్సుకు మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమయ్యి, కుబేరునికి లోకపాలకునిగా, ధనాధ్యక్షునిగా వుండే వరమిచ్చి అంతర్ధామయ్యాడు🙏🌼🌿
🌿🌼🙏ఎక్కడవుండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా, ఆయన ప్రత్యక్షమయ్యి, శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానం ప్రసాదించి, త్రికూట పర్వతం మీద, సముద్ర మధ్యభాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు వుండేవారని, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడకి వెళ్ళి ఉండమనీ చెప్పి మాయమయ్యాడు🙏🌼🌿
🌿🌼🙏ఆ తరువాత, కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి పరిపాలించసాగాడు. కుబేరుని ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసిన సుమాలి (పాతాళ రాజు) అసూయ చెందాడు. సుమాలి కుమార్తె కైకసి, విశ్రవ బ్రహ్మ రెండవ భార్య అనగా కుబేరుని సవతి తల్లి.) కైకసికి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడయిన కుమారుడు కావలెనన్న కోరికతో, విశ్రవుని ఆశ్రమానికి వెళ్ళింది🙏🌼🌿
🌿🌼🙏విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో, వేళ కాని వేళ కలిసినందున రావణుడు, కుంభకర్ణుడు జన్మిస్తారు. ఈ విషయం తెలుసుకున్న కైకసి తనకొక సత్పుత్రుడు కావలెనని అడగటంతో, విశ్రవుని అనుగ్రహం వలన విష్ణు భక్తి కల విభీషణుడు పుడతాడు. వీరంతా, కుబేరునికి సవతి తమ్ములు🙏🌼🌿
🌿🌼🙏కుబేరుడు భోగ భాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక, లంక మీదకి దండెత్తాడు రావణాసురుడు. కుబేరునికి శారీరక బలం తక్కువ, యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేదు, పైగా రావణాసురుడు హఠాత్తుగా రావటంతో రావణాసురుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుని, కుబేరుని తరిమేశాడు🙏🌼🌿
🌿🌼🙏దానితో భయపడిపోయిన కుబేరుడు కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు. గాలిని సైతం బంధించి, ఒంటి కాలి మీద నిలిచి, శివుని మనసులో నిలుపుకుని తపస్సు చేయసాగాడు. తన శరీరం నుండి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలూ వ్యాపించాయి. ఈయనకి తపోభంగం కలిగించటానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గూడులా మారిపోయింది🙏🌼🌿
🌿🌼🙏అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని చూసి, మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి, “లంకా నగరాన్ని మించిన దివ్యభవనాలతో, అపురూపమయిన చైత్ర రథం అనే ఉద్యానవనముతో, నవ నిధులతో, మణి మాణిక్యాలతో, సర్వ సంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను. ఇక నుండీ నీవు అక్కడే ఉంటూ, యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యకులకి రాజువై వుండు.' అని అనుగ్రహిస్తాడు🙏🌼🌿
🌿🌼🙏ధనంలో, దాత్రుత్వంలో, నిన్ను మించినవాడు ఈ సృష్టిలోనే ఉండరు. ఉత్తర దిక్కును పరిపాలిస్తూ, నా ప్రియ మిత్రుడవై, నాకు ఆప్తుడవై సంచరిస్తూ ఉండు ” అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమయ్యాడు, పరమేశ్వరుడు. . అందుకనే అధిక ధనము కల వారిని “ అపర కుబేరులు ” అంటారు🙏🌼🌿
🌿🌼🙏కుబేరునికి ఉన్న మరొక పేరు ఏకాక్షి పింగళుడు. ఈ పేరు తనకి ఎందుకు, ఎలా వచ్చిందో రామాయణంలో వస్తుంది. సీతా దేవిని బంధించిన రావణునితో, పర స్త్రీని గౌరవంగా చూడాలనీ, చెడు ఉద్దేశంతో చూడరాదనీ, సీతమ్మని విడిచి పెట్టమనీ హితవు బోధిస్తూ ఒక లేఖను పంపుతాడు కుబేరుడు🙏🌼🌿
🌿🌼🙏ఆ లేఖలో ఒకసారి పార్వతీదేవి అలకానగరం వెళ్ళినప్పుడు ఆవిడని కుబేరుడు ఐమూలగా చూడగా, ఆవిడ తేజస్సు వలన తన ఎడమ కన్ను మాత్రమే మూసుకునిపోవటం, అది గమనించిన పార్వతీదేవి కుబేరునికి కన్ను పోయేలా చేయటం, తద్వారా తన కన్ను పింగళ వర్ణం లోనికి మారిపోవటం వలన తనకి ఆ పేరు వచ్చిందనీ, అనుకోకుండా పరాయి స్త్రీని చూస్తేనే, అలా జరిగిందనీ, తెలిసి మరీ పరాయి స్త్రీని ఆశించవద్దనీ వ్రాసి పంపిస్తాడు. అందుకనే ' పరాయి స్త్రీని చూస్తే “కళ్ళు పోతాయి. ” అంటారు, పెద్దలు🙏🌼🌿
🌿🌼🙏అయితే, తన ప్రియమిత్రుడయిన కుబేరునికి ఇలా జరిగిందని తెలుసుకున్న శివుడు కుబేరునికి చెడు ఉద్దేశము లేదని జరిగిన సంఘటనను వివరించి, అమ్మవారిని అనుగ్రహించమని అనునయించటంతో, ఆ రెండవ కన్ను మళ్ళీ మామూలుగా మారి చూపు సంతరించుకుంటుంది. అందుకనే కుబేరుని ఎడమ కన్ను కుడి కన్ను కన్నా చిన్నదిగా ఉంటుంది. ఈ సంఘటన వలన అమ్మవారి అనుగ్రహం కూడా పొందగలిగాడు కుబేరుడు🙏🌼🌿
🌿🌼🙏ఎంతోమంది అదృష్ట చిహ్నంగా, సిరిసంపదల నొసగుతూ ఆనందాన్ని పెంపొందించే దైవంగా భావించే “ లాఫింగ్ బుద్ధ ” మన కుబేరుడే అని చాలా మంది నమ్మకం🙏🌼🌿
🌿🌼🙏కుబేరుని పూజించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి, వ్యాపార వృద్ధి, సామాజిక గుర్తింపు లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే, కుబేరుని ప్రతిమ కానీ, కుబేర దీపాలు కానీ ఎవరికి వారు కొనుక్కోవటం కన్నా కూడా, ఎవరయినా కానుకగా ఇచ్చినది మనం తీసుకుని పూజిస్తే విశేషమయిన ఫలితం ఉంటుందని నమ్మిక🙏🌼🌿
🌿🌼🙏ధన త్రయోదశి నాడు కుబేర పూజలు, కుబేర వ్రతాలు, ఈ మధ్యన మనం ఎక్కువగా చూస్తున్నా౦, నిత్యం మనకి తెలిసో, తెలియకుండానో కుబేరుడిని మంత్రపుష్పం చదివేటప్పుడు స్మరిస్తూనే ఉంటాం🙏🌼🌿
🌿🌼🙏“రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమోవయంవై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరోవై శ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహా రాజాయ నమః “ అని🙏🌼🌿
🌿🌼🙏హిందువులే కాక, బౌద్ధ, జైన మతాల వారు కూడా అధికంగా పూజించే, నమ్మే దైవం కుబేరుడు. బౌద్ధులు ఈయనని వైశ్రవణుడు లేదా జంభాలుడు అని పిలుస్తారు. బౌద్ధుల ప్రకారం, ఈయన చేతిలో ఎల్లప్పుడూ బంగారు నాణెములు కల ఒక సంచీ కానీ వజ్రములను, మణులను వెదజల్లే ముంగీస కానీ ఉంటాయి. అదే విధంగా, మరొక చేతిలో ఎల్లప్పుడూ నిమ్మకాయ (జంబీరము) ఉండటం వలననే ఈయనకి జంభాలుడు అనే పేరు వచ్చిందని చెప్తారు🙏🌼🌿
🌿🌼🙏అగ్ని పురాణం ప్రకారం, ఈయన ఆయుధం గద, వాహనం నరుడు (మనిషి). దీని ద్వారా మనిషి డబ్బుకి, ఐశ్వర్యానికి బానిసగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. కనుక మనిషి ధనానికి బానిస కాకుండా, స్వీయ నియంత్రణతో బంధువుగా వుంటూ, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని ఆశిద్దాం🙏🌼🌿
🌿🌼🙏“ఓం యక్షరాజాయ విద్మహే
అలకాధీశాయ ధీమహి
తన్నో కుబేరః ప్రచోదయాత్” 🙏🌼🌿
🌿🌼🙏అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సాయి సంకల్ప్🙏🌼🌿
🌿🌼🙏వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి 🙏🌼🌿
#అందరూ_దర్శించేందుకు_దయచేసి_షేర్_చేయండి
🌿🌼🙏అందరం భక్తితో " ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే " అని వ్రాసి అమ్మ వారి అనుగ్రహం పొందుదాం ... ఎంత ఆర్తితో స్మరిస్తే అంతగా అనుగ్రహిస్తుంది ఆ జగన్మాత ...🙏🌼🌿
ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే
No comments :