🙏\|/🙏కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి మనం ఆరాధన చేస్తూ ఈ విధముగా ఈ పరిహారాలు పాటిస్తే మన జీవితంలో ఎ ఎలాంటి కష్టం అయినా తొలగిపోయి మన సంపద పెరుగుతుంది. మరి అవేంటో తెలుసుకుందామా..? మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు పెట్టుకుంటాం. మీరు ముడుపు కట్టే ముం దు కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు పాటిస్తూ స్వామి ముడుపు వేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. అది ఎంత కష్టమైనా సమస్య అయినా సరే దాన్ని నుంచి తొందరగా బయటపడడానికి పరిహారం దొరుకుతుంది.
🙏\|/🙏ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకొని దాన్ని పసుపు కలిపినటువంటి నీళ్ళల్లో ముంచి మళ్లీ ఆరబెట్టి, అది పూర్తిగా ఆరిన తరువాత ఆ వస్త్రం పసుపు రంగు వస్త్రం అయి పోతుంది. ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి. తర్వాత 11 రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయి బిళ్ళలు లేదా 54 రూపాయి బిళ్ళలు లేకుంటే 108 రూపాయి బిళ్ళలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ వస్త్రంలో ఉంచి మూట కట్టాలి.
🙏\|/🙏ఈ మూట కట్టేటప్పుడు ఆ మూటకి మూడు ముళ్ళు వేయాలి. అయితే ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేస్తూ మీకు ఉన్నటువంటి సమస్యలు స్వామి వారికి చెప్పుకుంటూ ఆ మూళ్లను వేయాలి. ఆ ముడి వేసే ముందు మీరు ఇంట్లో వెంకటేశ్వరస్వామి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. తర్వాత నమస్కారం చేసుకుని ఓం నమో నారాయణాయనమః అంటూ 21 సార్లు చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని దేవుడికి చెప్పుకోవాలి. మనకు ఎంతటి కష్టమైనా దాని నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది.
🙏\|/🙏అంతేకాకుండా మూడు ముళ్ళు వేసేటప్పుడు కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ముడుపును మీ పూజ మందిరంలో ఉంచి వెంకటేశ్వరస్వా మిని అష్టోత్తరాన్ని చదవాలి. 108 గోవింద నామాలు చదవాలి. ఆ తర్వాత పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. ఇలా ముడుపు కట్టిన తర్వాత నీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకొని తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామి హుండీలో ఆ ముడుపులు వేసేటప్పుడు ఆ ముడుపు లో ఉన్నటువంటి దనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి వేయాలి.
🙏\|/🙏ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ వెంకటేశ్వరస్వామిని ముడుపు కట్టుకున్నట్టు అయితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఎంత కష్టమైనా సమస్య అయినా సరే దాని నుంచి చాలా సులభముగా బయటపడవచ్చు. దీంతోపాటుగా శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం పెడితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి.
ముడుపులు ఎవరు కడతారు:పిల్లలకు మంచి విద్య, సంతానం లేనివారికి సంతానం కలగాలని కోరుకోవడం, నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి కలగాలని, వ్యాపారస్థులకు వ్యాపారాభివృద్ధి కలగాలని, అనారోగ్యంతో ఉన్నవారు త్వరగా కోలుకోవాలని, అవివాహితులకు వివాహం కలగాలని వంటి కోరికలు నెరవేర్చుకోవడానికి ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతమని మాచిరాజు అంటున్నారు.
వేంకటేశ్వర స్వామివారికి ముడుపును ఎలా కట్టాలి:
- స్వామి వారికి ముడుపు కట్టే రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని నిత్య దీపారాధన చేయాలి.
- ఆ తర్వాత వినాయకుడికి మీ కోరిక విన్నవించాలి. అనంతరం ఏడుకొండలవాడికి ముడుపు కట్టాలి.
- ముందుగా ఓ గిన్నెలో కొద్దిగా పసుపు, గంధం, పచ్చ కర్పూరం వేయాలి. ఆ తర్వాత ఆ గిన్నెలో నీరు పోసి కలుపుకోవాలి.
- ఆ తర్వాత తెల్లటి వస్త్రాన్ని ఆ నీటిలో ముంచి కొద్దిసేపటి తర్వాత నీటిని పిండి ఆరేయాలి.
- ఇప్పుడు ఆ వస్త్రాన్ని తీసుకుని నాలుగు మూలల నాలుగు కుంకమ బొట్లు పెట్టాలి. అలాగే వస్త్రం మధ్యలో ఓ కుంకుమ బొట్టు పెట్టి అక్కడ కుంకుమతో వేంకటేశ్వర స్వామి తిరునామాన్ని తీర్చిదిద్దాలి.
- ఇప్పుడు ఆ వస్త్రాన్ని ఓ పీట మీద పరిచి ముందుగా ఆ వస్త్రంలో 7 ఎండు ఖర్జూరాలు ఉంచాలి. ఆ తర్వాత 7 యాలకులు, 7 లవంగాలు ఉంచి ఆ తర్వాత వాటిపై కొద్దిగా పచ్చ కర్పూరం వేయాలి. ఆ తర్వాత అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు కూడా వేయాలి.
- ఆ తర్వాత 11 లేదా 21 లేదా 54 లేదా 108 లేదా 111 లేదా 116 లేదా 516 రూపాయి నాణేలు ఆ వస్త్రంలో ఉంచాలి. ఇలా నెంబర్స్ మాత్రమే కాకుండా మూడు దోసిళ్ల రూపాయి నాణేలు కూడా అందులో వేయొచ్చు.
- పైన చెప్పినవన్నీ వేసి ఆ వస్త్రాన్ని మూట కట్టాలి. మొత్తంగా మూడు ముడులు వేసి మూట కట్టాలి. అలా ముడులు వేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరిక లేదా సమస్య చెప్పుకోవాలి.
- ఆ తర్వాత ఆ మూట మీద పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టాలి. ఆ మూట పై భాగంలో వేంకటేశ్వర స్వామి తిరునామాన్ని కుంకుమతో తీర్చిదిద్దాలి.
- ఇప్పుడు ఆ మూటను ఓ ప్లేట్లో ఉంచి వాటిని వేంకటేశ్వర స్వామి వారి చిత్రపటం వద్ద ఉంచి ధూపం సమర్పించాలి. ఆ తర్వాత వేంకటేశ్వర స్వామి నామాలు,వీలైతే గోవింద నామాలు కూడా చదువుకోవాలి.
- ఆ తర్వాత ఆ ముడుపును మీ సమస్య తీరేవరకు లేదా కోరిక నెరవేరేవరకు స్వామి వారి వద్ద ఉంచాలి.
- కోరిక లేదా సమస్య తీరిన తర్వాత ఆ ముడుపును వేంకటేశ్వర స్వామి ఫొటో వెనుక ఉంచి మీరు తిరుమల వెళ్లినప్పుడు హూండీలో ఈ మూట వేసి దానితో పాటు వడ్డీని సమర్పించాలి.
No comments :