ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది.అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముక్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు.
లడ్డూ ప్రసాదంగా
ఒకప్పుడు బియ్యప్పిండితో చేసిన లడ్డూ ప్రసాదాన్నే తిరుమలకు వచ్చిన భక్తులకు శ్రీవారి ప్రసాదంగా అందించేవారట. బియ్యప్పిండి, బెల్లం కలిపి కట్టిన ఈ లడ్డూలను మనోహరాలని పిలిచేవారు. కర్ణాటక మెల్కోటే దేవాలయంలో మనోహరం ప్రసాదాన్నే పెడతారు. మధుర మీనాక్షి దేవాలయంలో బియ్యప్పిండి, మిన్నప్పిండి, పెసరపిండి కలిపి, లావు కారప్పూస వండి దాన్ని చిన్న ముక్కలుగా విరిచి బెల్లం పాకంలోవేసి, ఉండ కట్టి నైవేద్యం పెడతారు. దీన్ని మనోహరం అంటారు. మన మిఠాయి లడ్డూ ఇలాంటిదే!మనోహరాల గురించి హంసవింశతి కావ్యంలో కూడా ప్రస్తావన ఉంది. అంటే మూడువందల యాభయ్యేళ్ళ క్రితంవరకూ మనోహరం ఒక ప్రసిధ్ధమైన తీపి వంటకం
లడ్డూలలో రకాలు
ఆస్ధానం లడ్డూ - ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమపువ్వుతో ప్రత్యేకంగా తయారుచేస్తారు. వీటిని ప్రత్యేక వుత్సవాలు సందర్భంగా మాత్రమే తయారుచేస్తారు.ప్రత్యేక అతిధులకు మాత్రమే వీటిని అందజేస్తారు.
కళ్యాణోత్సవ లడ్డూ - కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు భక్తులకూ కల్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు
ప్రోక్తం లడ్డూ - వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు.
గోవిందా గోవిందా
No comments :